![]() |
![]() |

బిగ్ బాస్ ఈ సీజన్ లోకి కామనర్స్ కి ఛాన్స్ ఇచ్చారు. ఆ కామనర్స్ లో ఇద్దరు టాప్-5 లో ఉన్నారు. వాళ్లలో డీమాన్ ఒకడు.. ఒక సామాన్య ఇంటి నుండి అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన అటతో మంచి పాజిటివిటి తెచ్చుకొని టాప్-5 లో అడుగుపెట్టాడు. డీమాన్ పవన్ గురించి బిగ్ బాస్ ఎలివేషన్ ఇచ్చి చెప్తుంటే గుస్ బంప్స్ వచ్చాయి.
కాసేపటికి డీమాన్ పవన్ ని బిగ్ బాస్ గార్డన్ ఏరియాకి పిలిచి తన జర్నీ వీడియో ప్లే చేశాడు. బిగ్ బాస్ గ్రాంఢ్ లాంచ్ రోజు నుండి మొదలు నుండి నిన్నటి వరకు సాగిన అతని ప్రయాణామ్ని ఈ జర్నీ వీడియోలో చూపించాడు. ఇందులో ఎక్కువగా రీతూతో ఉన్న మెమరీస్ ఉన్నాయి. డీమాన్ కెప్టెన్ అవ్వడం.. అది రద్దు అవడం మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ కెప్టెన్ అవ్వడం అదంతా మంచి ఎలివేషన్ ఇచ్చి ఎడిట్ చేశాడు. రీతూతో ఉన్న షాట్స్ అన్నిటింకి లవ్ సాంగ్ ప్లే చేశాడు. అవన్నీ చూస్తూ పవన్ ఎమోషనల్ అయి ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ హౌస్ లోకి ఎంట్రీ అవ్వడం. రీతూతో తప్పుగా బెహేవ్ చేసినప్పుడు నాగార్జున రెడ్ కార్డ్ ఇచ్చి వెళ్ళమని చెప్పడం.. అదంతా చూసి పవన్ ఏడుస్తాడు.
జర్నీ వీడియో మొత్తం చూసి డీమాన్ పవన్ ఏడుస్తాడు. చాలా బాగుంది బిగ్ బాస్ నేను ఇలా ఉంటానని ఊహించలేదు.. చాలా నేర్చుకున్నా.. నాకు బిగ్ బాస్ అవకాశం అనేది పునర్జన్మ అని పవన్ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత తనకి నచ్చిన ఫొటోస్ అన్నీ తీసుకొని హౌస్ లోకి వెళ్తాడు. తన ఫ్రెండ్స్ తో హ్యాపీ నెస్ ని షేర్ చేసుకుంటాడు. ఎంట్రీ నుండి మొత్తం రీతూకి నీకు లవ్ సాంగ్స్ వేసినట్లున్నారని డీమాన్ పవన్ తో తనూజ అంటుంది. మరి డీమాన్ పవన్ జర్నీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
![]() |
![]() |